
గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం మాదిరి పరీక్ష నిర్వహణ పై విద్యార్థులకు అవగాహన దిశగా అడుగులు వేస్తూ శనివారం పరీక్ష నిర్వహించారు. నేడు ఆదివారం ఉదయం 11 గం.లకు తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2024 (V TGCET 2024) నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సన్నద్దం కావడం కోసం బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు అవగాహన కల్పించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, విద్యార్థులకు పరీక్ష గురించి ప్రొజెక్టర్ పైన వివరించడం జరిగింది. పరీక్ష రాసే విద్యార్థులు హాల్ టికెట్, బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను, పరీక్ష ప్యాడ్ తీసుకుని ఒక గంట ముందే అనగా ఉదయం 10 గం.లకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు ఓఎంఆర్ షీట్ లో ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న నాలుగు ఆప్షన్ లలో సరైన సమాధానం ఉన్న వృత్తాన్ని పెన్నుతో నల్లగా దిద్దాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు అభ్యాసం కోసం మాదిరి ప్రశ్నాపత్రం,ఓఎంఆర్ షీట్ లను ఇచ్చి, మాదిరి పరీక్షను నిర్వహించడం జరిగింది. విద్యార్థులు పరీక్ష బాగా రాసి సీట్లు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, పద్మావతి పాల్గొన్నారు.