– కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ-పరిగి
అవెన్యూ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహించనున్న సామూహిక హరితోత్స వం కార్యక్రమంలో భాగంగా గురువారం పరిగి మున్సిపల్, పరిగి మండల పరిధిలోని గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటేందుకు ఎంపిక చేసిన స్థలాలలో తీసిన గుంతలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. పరిగి మండల పరిధిలోని సాలె పూలబాటతండాలోని 10 ఎకరాల అటవీ భూమిలో లక్ష్యం మేరకు 30 వేల మొక్క లు నాటేందుకు గుంతలు తవ్వే పనులను ఎంపీపీ అరవింద రావుతో కలిసి పరిశీలించారు. 9 ఏండ్లుగా హరి తహారంలో మొక్కలు నాటినప్పటికీ అవెన్యూ ప్లాంటేషన్ కింద హైవేకు ఇరువైపులా చెట్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం రోజున మున్సిపల్ పరిధిలో కేటాయించిన లక్ష్యం మేరకు 5 వేల మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యతనిచ్చి పెద్ద సైజు గల నాణ్యమైన మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూ చించారు. ప్రతి మొక్కకూ ఆధారంగా కర్రను పెట్టాల న్నారు. ఇంకా 2 రోజులే సమయం ఉన్నందున గుంతలు తవ్వే పనులన్నీ పద్ధతి ప్రకారంగా పూర్తి చేసుకోవా లన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఆకర్షణీయంగా పెద్ద సైజు మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో పరిగి ఎంపీపీ అరవింద రావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పరిగి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, డీపీఓ తరుణ్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ సుధారాణి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.