ఆదాయం వచ్చే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి

అడిషనల్ కలెక్టర్ కు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్న మున్సిపల్ చైర్మన్, కమిషనర్
అడిషనల్ కలెక్టర్ కు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్న మున్సిపల్ చైర్మన్, కమిషనర్

– 100% హౌస్ టాక్స్ వసూలు చేయాలి
– జిల్లా అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్
నవతెలంగాణ అచ్చంపేట:  మునిసిపాలిటీలో ఆదాయ వచ్చే పనులను ప్రాధాన్యత ఇవ్వాలని, వనరులను సృష్టించుకోవాలని, 100% హౌస్ టాక్స్ వసూలు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ మున్సిపాలిటీ అధికారులకు సూచించారు. మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయానీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చైర్మన్ నరసింహ గౌడ్, కమిషనర్ శ్రీహరి రాజులు స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. భవనాలు భువన యాప్ నమోదు చేస్తున్నారా…. ఆదాయం వచ్చే పనుల ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాలు చేపడితే వెంటనే పనులు నిలుపుదల చేయాలని ఆదేశించారు. జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ రంగాల కార్మికులు సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేయకుండా సమయపాలన పాటించాలని సూచించారు. వార్డుల వారీగా ప్రతిరోజు పర్యటించాలని, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. కౌన్సిలర్లు గౌరీ శంకర్ , అంతటి శివ, రమేష్ లు ఉన్నారు.

అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకుంటున్న అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్
అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకుంటున్న అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్