భాలీవుడ్ మార్గ‌ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్‌ కపూర్‌

భాలీవుడ్ మార్గ‌ద‌ర్శ‌కుడు (నవంబర్‌ 3న పృథ్వీరాజ్‌ కపూర్‌ జయంతి సందర్భంగా..)

పథ్వీరాజ్‌ భారతీయ సినిమా మూకీ యుగంలో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా పథ్వీ థియేటర్స్‌ పేరుతో తన సొంత థియేటర్‌ సెట్‌లను స్థాపించాడు. హిందీ చిత్ర పరిశ్రమకు మార్గదర్శకుడిగా, కపూర్‌ వంశ పితామహుడుగా, సినీ పరిశ్రమకు ఐదు తరాల నటులను అందివ్వడమే కాకుండా, తన చరిష్మా తో 40 సంవత్సరాల పాటు చలనచిత్ర పరిశ్రమను పాలించాడు. ‘అవారా’, ‘మొఘల్‌-ఇ-అజామ్‌’, ‘మహారథి కర్ణ’, ‘అనాథ్‌ ఆశ్రమం’ చిత్రాలు ఆయనకు విశేషఖ్యాతిని తెచ్చిపెట్టాయి. భారతీయ సినిమాకి ఆయన చేసిన కషికి భారత ప్రభుత్వం 1969లో ‘పద్మభూషణ్‌’ తో సత్కరించగా, 1972 లో ఆయన మరణానంతరం 1971 సంవత్సరానికి గాను భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’ ను ప్రకటించింది. దీనితో, అతను భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న మూడవ వ్యక్తి అయ్యాడు. పథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగాడు.
పథ్వీరాజ్‌ కపూర్‌ (పథ్వీనాత్‌ కపూర్‌) 1906వ సంవత్సరం నవంబర్‌ 3వ తేదీన పంజాబ్‌ పెషావర్‌ (ఇప్పుడు పాకిస్థాన్‌ లోని ఫైసలాబాద్‌) లోని సముంద్రిలో మధ్యతరగతి హిందూ పంజాబీ ఖత్రీ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ‘దేవాన్‌ బాషేశ్వర్నాథ్‌ కపూర్‌’ పోలీసు అధికారి. తాత ‘కేశవ్మల్‌ కపూర్‌’ సముండ్రిలో తహసిల్దార్‌గా పని చేసేవాడు. పథ్వీరాజ్‌ కపూర్‌ ఎనిమిది మంది తోబుట్టువులలో పెద్ద కుమారుడు. కుటుంబ సభ్యులు, బంధువులు లయాల్‌పూర్‌లో ఉండటంతో, పథ్వీరాజ్‌ బాల్యం ఎక్కువగా అక్కడే గడిచింది. అక్కడే ఖల్సా కాలేజీ లో పాఠశాల విద్యను పూర్తి చేసి, పెషావర్‌లోని ఎడ్వర్డ్‌ కళాశాలలో చేరి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఒక సంవత్సరం న్యాయశాస్త్రం చదివాడు. నటుడిగా తన కలలను సార్థకం చేసుకునే నేపథ్యంలో న్యాయ విద్య అధ్యయనానికి అంతరాయం కలిగింది. 17 సంవత్సరాల వయస్సులో రామ్‌సర్ని ను వివాహం చేసుకున్నాడు.
కెరీర్‌
పృథ్వీరాజ్‌ కపూర్‌ లయాల్‌పూర్‌, పెషావర్‌లలో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా తన నటనా వత్తిని ప్రారంభించాడు. 1928 లో పృథ్వీరాజ్‌ తన అత్త నుండి అప్పు తీసుకున్న డబ్బుతో బొంబాయికి వెళ్లి ఇంపీరియల్‌ ఫిల్మ్స్‌ కంపెనీలో చేరాడు. ఆ సంస్థ సినిమాల్లో.. చిన్న, చిన్న పాత్రలలో నటించడం ప్రారంభించాడు. 1929 లో తన మూడవ చిత్రం ‘సినిమా గర్ల్‌’ లో మొదటి సారి ప్రధాన పాత్రను పోషించాడు. ఆ సినిమాలో పథ్వీరాజ్‌ నటనకు మంచి గుర్తింపు రావడంతో, ‘దో ధారి తల్వార్‌’, ‘షేర్‌-ఎ- అరబ్‌,’ ‘ప్రిన్స్‌ విజయకుమార్‌’ వంటి తొమ్మిది మూకీ చిత్రాలలో నటించే అవకాశం వచ్చింది. 1931 లో దేశంలోని మొట్టమొదటి టాకీ ‘ఆలం అరా’ విడుదలైంది. ఆ చారిత్రక చిత్రంలో పథ్వీరాజ్‌ కపూర్‌ సహాయక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 1933లో రాజారాణి, మీరా, 1934 లో దేబాకి బోస్‌, సీత చిత్రాల్లో నటించాడు. 1936 లో మంజిల్‌, 1937 లో ప్రెసిడెంట్‌, విద్యాపతి వంటి కొన్ని ఉత్తమ చిత్రాలలో నటించాడు. 1939 లో దుష్మన్‌, 1940 లో చింగారి, సజని, 1940 లో మూవీటోన్‌ రంజిత్‌తో తీసిన పాగల్‌, 1941లో రాజ్‌ నర్తకి చిత్రాలలో నటించాడు. ఇదే ఏడాది సోహ్రాబ్‌ మోదీ రూపొందించిన ”సికందర్‌’ చిత్రంలో అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ పాత్రలో పథ్వీరాజ్‌ నటన చిరస్థాయిగా నిలిచిపోయింది. 1942 లో ఏక్‌ రాత్‌, 1943 లో ఇషారా, 1944 లో మహారథి కర్ణ చిత్రాలలో పృథ్వీరాజ్  నటన ప్రశంసలు అందుకున్నాయి.
పృథ్వీయేటర్స్‌ స్థాపన
ఆధునిక భారతీయ థియేటర్‌ గురించి ప్రస్తావిస్తే, మొదటగా గుర్తుకు వచ్చే గొప్ప వ్యక్తి పథ్వీరాజ్‌ కపూర్‌. థియేటర్‌ నటుడిగా బ్రిటిష్‌ ప్లేహౌస్‌ అయిన ‘గ్రాంట్‌ ఆండర్సన్‌ థియేటర్‌’లో చేరి చిత్రాలలో నటించాడు. అయితే పథ్వీరాజ్‌ చేరిన కొద్ది రోజులకే ఆ కంపెనీ ఇంగ్లాండ్‌కు మారింది. దీంతో 1944 లో ట్రావెలింగ్‌ థియేటర్‌ కంపెనీగా ‘పథ్వీ థియేటర్స్‌’ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ సాంఘిక, రాజకీయ నాటకాలకు ప్రసిద్ధి చెందిన ట్రావెలింగ్‌ థియేటర్‌ కంపెనీగా భారతదేశం అంతటా చిరస్మరణీయమైన ప్రదర్శనలను ఇచ్చింది. పథ్వీ థియేటర్స్‌ నాటకాలు అత్యంత ప్రభావవంతమైనవి. భారత స్వాతంత్య్ర ఉద్యమం, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి యువతను ప్రేరేపించాయి. 16 సంవత్సరాల కాలంలో ఈ థియేటర్‌ 2,662 ప్రదర్శనలను ప్రదర్శించింది. ఇందులో ప్రతి ప్రదర్శనలో పథ్వీరాజ్‌ ప్రధాన పాత్ర పోషించాడు. 1996 లో థియేటర్‌ గోల్డెన్‌ జూబ్లీలో ‘ఇండియన్‌ పోస్ట్‌’ రెండు రూపాయల పోస్టల్‌ స్టాంప్‌ను, భారతీయ సినిమా 100 సంవత్సరాల సందర్భంగా, పథ్వీరాజ్‌ పోలికను కలిగి ఉన్న మరొక తపాలా బిళ్ళను ‘ఇండియన్‌ పోస్ట్‌’ 3 మే 2013న విడుదల చేసింది. అతని ప్రసిద్ధ నాటకాల్లో ఒకటైన ఒక ముస్లిం, హిందూ స్నేహితుడి కథతో 13 ఏప్రిల్‌ 1947న ప్రారంభమైన ‘పఠాన్‌’ నాటకం ముంబైలో దాదాపు 600 సార్లు ఒకే వేదికపై ప్రదర్శించబడి రికార్డు సష్టించింది. ఎన్నో హిట్లు, సూపర్‌ హిట్‌ నాటకాలలో నటించి అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసిన పథ్వీరాజ్‌, థియేటర్‌ లో షో ముగిసిన తర్వాత గేటు వద్ద బ్యాగ్‌తో నిలబడి ఉండేవాడట. షో నుంచి బయటకు వచ్చిన వారు ఆ బ్యాగులో కొంత డబ్బు పెడితే, ఆ డబ్బుతో పథ్వీరాజ్‌ థియేటర్‌ లో పనిచేసే ఉద్యోగులకు సాయం చేసేవాడు. అయితే 1950 దశాబ్దం చివరి నాటికి ట్రావెలింగ్‌ థియేటర్‌ యుగం సినిమా ప్రభావం కారణంగా అంతిమ దశకు చేరుకుంది. దాదాపు 80 మంది నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు, అతని కుమారులు సినిమా రంగం లోకి వెళ్లారు. దీంతో పథ్వీ థియేటర్‌ ఇండియన్‌ షేక్‌స్పియర్‌ థియేటర్‌ సంస్థ ‘షేక్‌స్పియెర్నా’లో విలీనం అయ్యింది. అయితే ఆ తర్వాత కొన్నేళ్లకు జుహూ ప్రాంతంలో లీజు స్థలంలో ఉన్న పథ్వీ థియేటర్‌ స్థలాన్ని శశికపూర్‌ కొనుగోలు చేసి, చిన్న ప్రయోగాత్మక థియేటర్‌గా పథ్వీరాజ్‌ గౌరవార్థం ఆయనకు నివాళిగా పథ్వీ థియేటర్‌ని పునరుద్ధరించాడు. 5 నవంబర్‌ 1978న ఈ థియేటర్‌కు శాశ్వత వేదికను ఏర్పటుచేసి ”షో తప్పనిసరిగా కొనసాగాలి …” అనే నినాదంతో ప్రదర్శనలకు శ్రీకారం చుట్టాడు.
రంగస్థలం నుంచి తిరిగి సినిమాల్లోకి
పృథ్వీరాజ్‌ కపూర్‌ తన 50వ దశకానికి చేరుకున్నప్పుడు, క్రమంగా థియేటర్‌ కార్యకలాపాలను నిలిపివేసి, తన కుమారులతో సహా బయటి నిర్మాతల నుండి వచ్చిన ఆఫర్లను అంగీకరించాడు. 1950 లో దహేజ్‌ చిత్రంతో తన రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పథ్వీరాజ్‌ తన కుమారుడు రాజ్‌ కపూర్‌ తో కలిసి 1951 లో ‘ఆవారా’ చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో పథ్వీరాజ్‌ తండ్రి ‘బషేశ్వర్‌ నాథ్‌ కపూర్‌’ కూడా చిన్న పాత్ర పోషించాడు. 1952 లో ఆనంద్‌ మఠ్‌, 1953 లో ఛత్రపతి శివాజీ, 1954లో ‘పైసా’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నప్పుడు అతను తన గొంతుని కోల్పోయాడు. ఆ తర్వాత 1957 లో పర్దేశీ, 1959లో జగ్గా డాకు, 1960 లో ‘మొఘల్‌ ఎ ఆజం’ లో నటించాడు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ‘మొఘల్‌-ఎ-ఆజం’ చిత్రం అతను అత్యంత ఇష్టపడే హిట్‌ చిత్రాలలో ఒకటి. ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ అక్బర్‌గా అద్భుతంగా నటించాడు. దిలీప్‌ కుమార్‌, మధుబాల, దుర్గా ఖోటే, నిగర్‌ సుల్తానా వంటి తారలు ఈ చిత్రానికి పని చేసి అందరి హదయాలను గెలుచుకున్నారు.
1963 లో ‘హరిశ్చంద్ర తారామతి’, రుస్తమ్‌ సోహ్రాబ్‌, 1964 లో జిందగీ, గజల్‌, 1965 లో ‘సికందర్‌-ఎ-ఆజం, జాన్వర్‌’, 1966 లో ఢాకూ మంగళ్‌సింగ్‌, లవ్‌ అండ్‌ మర్డర్‌, 1968 లో తీన్‌ బహురానియన్‌, 1970 లో హీర్‌ రాంఝా, 1971 లో కన్నడ సినిమాలో ‘రాజ్‌కుమార్‌’ తండ్రిగా ‘సాక్షాత్కార’, ‘కల్‌ ఆజ్‌ ఔర్‌ కల్‌’ తదితర చిత్రాల్లో భిన్నమైన పాత్రలలో ప్రతిభ కనబరిచిన నటునిగా గుర్తింపు పొందాడు. పథ్వీరాజ్‌ పంజాబీ చిత్రాలలో 1969 లో ‘నానక్‌ నామ్‌ జాహాజ్‌’ చిత్రంలో పితస్వామ్య అధిపతిగా నటించాడు. ఈ చిత్రం పంజాబీ సిక్కులపై ప్రధాన సాంస్కతిక ప్రభావంతో స్వతంత్రానంతర భారతదేశంలో, విదేశాలలో మొదటి విజయవంతమైన పంజాబీ చిత్రంగా నిలవడమే కాకుండా భారతదేశంలో పంజాబీ చలనచిత్ర పరిశ్రమ నిలదొక్కుకోవడానికి దోహదకారి అయ్యింది. 1970 లో ‘నానక్‌ దుఖియా సబ్‌ సంసర్‌’, 1972 లో ‘మేలే మిత్రాన్‌ దే’ వంటి పంజాబీ పురాణ సినిమాల్లో ఆయన వేసిన పాత్రలు మరువ లేనివి.
పృథ్వీరాజ్‌ కుటుంబం
పృథ్వీరాజ్‌ కపూర్‌ 17 ఏళ్ల వయసులో తను ప్రేమిస్తున్న రామ్‌సర్నీ ని వివాహం చేసుకున్నాడు. వారికి 1924లో రాజ్‌ కపూర్‌ జన్మించాడు. 1928లో పథ్వీరాజ్‌ బొంబాయి చేరుకునే సమయానికి, వారికి ముగ్గురు పిల్లలు. 1931లో పథ్వీరాజ్‌పృథ్వీరాజ్‌ణించగా, మరొక కుమారుడు రవీందర్‌ తోటలో వేసిన ఎలుక-పాయిజన్‌ మాత్రలను మింగడంతో మరణించాడు. అనంతరం ఈ దంపతులకు మరో ముగ్గురు పిల్లలు పుట్టారు. వారు షంషేర్‌ రాజ్‌ (షమ్మీ కపూర్‌), బల్బీర్‌ రాజ్‌ (శశి కపూర్‌) తోపాటు కూతురు ఊర్మిళ జన్మించింది. తర్వాత కాలంలో పథ్వీరాజ్‌ ముగ్గురు కుమారులు రాజ్‌ కపూర్‌, షమ్మీ కపూర్‌, శశి కపూర్‌ బాలీవుడ్‌లోనే ప్రముఖ నటులుగా స్థిరపడ్డారు. అయితే వారి కుటుంబాన్ని నిలబెట్టడంలో రామ్‌సర్ని కీలక పాత్ర పోషించడంతో పాటు, పథ్వీరాజ్‌ కపూర్‌ జీవితంలోని అన్ని ఒడిదుడుకుల సమయంలో ఆయనకు మద్దతుగా నిలిచింది. చివరికి వీరు క్యాన్సర్‌ బారిన పడి 15 రోజుల వ్యవధిలో ఇద్దరూ మరణించారు.
ఐదు తరాల సినీ కుటుంబం
పథ్వీరాజ్‌ నటుడిగా సినీ రంగంలో అడుగు పెట్టాక, కపూర్‌ కుటుంబం భారతదేశంలో ఐదు తరాల సినీ కళాకారులను కలిగి ఉన్న ఏకైక కుటుంబంగా నిలిచిపోయింది. తండ్రి ‘దేవాన్‌ బాషేశ్వర్నాథ్‌ కపూర్‌’ రాజ్‌ కపూర్‌ చిత్రం ‘అవారా’లో అతిధి పాత్రలో నటించారు. అతని చిత్రాలలో ఒకటి ‘కల్‌ ఆజ్‌ అవుర్‌ కల్‌’ లో కుమారుడు రాజ్‌ కపూర్‌, మనవడు రణధీర్‌ కపూర్‌, ఇలా పథ్వీరాజ్‌ కపూర్‌ కుటుంబానికి చెందిన మూడు తరాలు నటులు ఒకే చిత్రంలో నటించారు. అయితే ఈ చిత్ర నిర్మాణం తర్వాత పథ్వీరాజ్‌ ఆరోగ్యం క్షీణించడంతో, అతను హాస్పిటల్‌ బెడ్‌ నుండి డబ్బింగ్‌ పూర్తి చేశాడు.
ఆగిపోయిన ఎన్టీఆర్‌, పథ్వీ సినిమా
ఎన్టీఆర్‌, బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు పథ్వీరాజ్‌ కపూర్‌ కలిసి ఓ సినిమాలో నటించాల్సింది. అయితే ఆ సినిమా ఆగిపోయింది. కథ నచ్చి పారితోషకం తీసుకోకుండా సినిమా చేస్తానని పథ్వీరాజ్‌ కపూర్‌ వంటి నటుడు ఆసక్తి చూపిన ఆ సినిమా ఆగిపోవడానికి గల కారణాలేంటనే విషయంలోకి వెళితే.. ఎన్టీఆర్‌, కాంతారావు, మరో ముగ్గురు హీరోలతో ప్రముఖ నిర్మాత యు.విశ్వేశ్వరరావు ‘కంచు కాగడా’ అనే సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో హీరోల తండ్రి పాత్ర కోసం ఓ ప్రముఖ నటుడిని సంప్రదించగా పారితోషకం విషయంలో ఒప్పందం కుదరలేదు. ఆ సమయంలో విశ్వేశ్వరరావుకు, ఆ పాత్రను బాలీవుడ్‌లో స్టార్‌ నటుడైన పథ్వీరాజ్‌ కపూర్‌తో చేయిస్తే బావుంటుందని ఆలోచించి, ముంబై వెళ్లి ఆయన్ని కలిశారట. కథ నచ్చిన పథ్వీరాజ్‌ కపూర్‌ ఎలాంటి రెమ్యునరేషన్‌ లేకుండా నటిస్తానని, తెలుగులో డైలాగ్స్‌ కూడా చెబుతానని కూడా అన్నారట. విశ్వేశ్వరరావు ద్వారా విషయం తెలుసుకున్న ఎన్టీఆర్‌ సంతోషపడ్డారు. మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్‌ ప్రారంభం కావడానికి సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో, సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న జమున గర్భవతి కావడం, ఆమె ప్రసవించే సమయానికి పథ్వీరాజ్‌ కపూర్‌ మరణించడంతో ప్రాజెక్ట్‌ ఆగిపోయింది.
పైడి జైరాజ్‌ పెళ్లి పెద్దగా పథ్వీరాజ్‌
పథ్విరాజ్‌, తెలంగాణకు చెందిన బాలీవుడ్‌ నటులు పైడి జైరాజ్‌ ల మధ్య మంచి స్నేహం ఉండేది. వీరు తరచూ కలుసుకుని, వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాల గురించి చర్చించుకునేవారు. ఒక రోజు మాటల సందర్బంలో జైరాజ్‌ కు ఢిల్లీకి చెందిన ‘సావిత్రి’ అనే పంజాబీ అమ్మాయితో ఉన్న ప్రేమ విషయం తెలుసుకున్న పథ్వీరాజ్‌ పెళ్లి పెద్దగా వ్యవహరించి వారిద్దరికి వివాహం జరిపించారు. పథ్విరాజ్‌ కపూర్‌తో జైరాజ్‌ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో పథ్విరాజ్‌ కుటుంబ సబ్యులు రాజ్‌ కపూర్‌, షమ్మికపూర్‌, శశికపూర్‌లు జైరాజ్‌ని ‘పాపాజీ’ అని గౌరవంగా పిలుస్తూ తండ్రితో సమానంగా చూసేవారు. వీరిద్దరు కలసి 1948 లో ‘ఆజాదీ కి రహా పర్‌’ తో పాటు మరిన్ని చిత్రాలలో నటించారు. ‘ఆజాదీ కి రహా పర్‌’ సినిమా భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో సాగడంతో ఆనాటి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి ఘనవిజయాన్ని అందించారు. 1965 లో జైరాజ్‌ కుమారుడు ‘దిలీప్‌ రాజ్‌’ కు తండ్రిగా పథ్వీరాజ్‌ ‘అస్మాన్‌ మహల్‌’ చిత్రంలో నటించాడు.
సామాజిక సేవకుడు కూడా
పథ్వీరాజ్‌ గొప్ప సినిమా కళాకారుడు మాత్రమే కాదు, అంకితభావంతో కూడిన సామాజిక సేవకుడు కూడా. అతను 1947లో పశ్చిమ పంజాబ్‌, బెంగాల్‌ నుండి భారతదేశానికి పారిపోయి వచ్చిన హిందూ, సిక్కు శరణార్థుల కోసం విరాళాలు వసూలు చేసి వారికి సహాయం చేశాడు. రాజ్యసభలో పథ్వీరాజ్‌ మరణశిక్ష, ఆహార భద్రత రద్దు బిల్లుకు మార్గదర్శకత్వం వహించారు. అతను 1943 బెంగాల్‌ కరువు బాధితుల కోసం అనేక నాటకాలు వేయడం ద్వారా వచ్చిన డబ్బును బెంగాల్‌, సమీపంలోని పేదల కోసం విరాళంగా ఇచ్చాడు. ఇండో-చైనా శాంతి స్థాపన కార్యక్రమం కోసం చైనాకు వెళ్లేందుకు ఆయనను అప్పటి ప్రధాని పండిట్‌ నెహ్రూ రెండుసార్లు ఎంపిక చేశారు. ఆర్థికంగా, మానసికంగా సహాయం అవసరమైన వందలాది మందికి పథ్వీరాజ్‌ గాడ్‌ ఫాదర్‌ అయ్యాడు. తానే స్వయంగా వారికోసం కూలీ పనులు చేసేవాడు. కలకత్తాలో ఒకసారి పథ్వీరాజ్‌ ఓ వద్ధుడు వీధిని ఊడ్చడాన్ని చూశాడు. అతన్ని బ్రిటిష్‌ మున్సిపల్‌ అధికారి ‘బెల్ట్‌’ తో కొట్టడం చూసి చలించిపోయాడు. ఆ రోజు తర్వాత, అతను కలకత్తాలో నివసించినంత కాలం, వద్ధుడి కోసం వీధిని ఊడ్చాడు. 1940 – 50ల మధ్యకాలం వరకు రూ.1,11,110 అత్యధిక పారితోషికం పొందిన నటుడుగా పేరొందిన పథ్వీరాజ్‌, జీతంలో సగం నిరుపేదలకు విరాళంగా ఇచ్చి, మిగిలిన సగాన్ని తన వద్దే ఉంచుకుని, నాటకరంగంలో పెట్టుబడి పెట్టాడనేది అందరికీ తెలియని వాస్తవం.
అవార్డులు
పథ్వీరాజ్‌కు 1949లో రాష్ట్రపతి మెడల్‌, 1954 లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌, 1956లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. 1996 లో థియేటర్‌ గోల్డెన్‌ జూబ్లీలో ‘ఇండియన్‌ పోస్టల్‌ శాఖ’ రెండు రూపాయల పోస్టల్‌ స్టాంప్‌ను, భారతీయ సినిమా 100 సంవత్సరాల సందర్భంగా, మరొక తపాలా బిళ్ళను ఇండియా పోస్టల్‌ శాఖ 2013వ సంవత్సరం మే 3న విడుదల చేసింది. భారతీయ సినిమాకి ఆయన చేసిన కషికి భారత ప్రభుత్వం 1969లో ‘పద్మభూషణ్‌’, తో సత్కరించగా, 1972 లో ఆయన మరణానంతరం 1971 సంవత్సరానికి గాను భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’ ను ప్రకటించింది. దీనితో, అతను భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న మూడవ వ్యక్తి అయ్యాడు. పథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగాడు.
మరణం
సినిమాల నుండి రిటైర్‌ అయిన తర్వాత పృథ్వీరాజ్‌, అతని భార్య రామ్‌సర్ని ఇద్దరికీ వద్ధాప్యంలో క్యాన్సర్‌ సొకడంతో వారు ప్రత్యేకంగా బొంబాయిలోని జుహు బీచ్‌ కాటేజీలో నివాసం ఉన్నారు. అయితే కొన్నాళ్ళ తర్వాత వారిరువురి ఆరోగ్యం క్షీణించడంతో పథ్వీరాజ్‌ 29 మే 1972న మరణించగా, అతని భార్య పదిహేను రోజుల తర్వాత జూన్‌ 14న మరణించింది. పథ్వీరాజ్‌ మరణించి దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత కూడా ప్రేక్షకులు ఆయన నటించిన సినిమాలను అదరిస్తూనే వున్నారు.
– పొన్నం రవిచంద్ర,
9440077499