రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో 23 రకాల సోయపంటను వేయగా, అట్టి పంటను పరిశీలించడానికి ప్రైవేట్ శాస్త్రవేత్తలు సోమవారం విచ్చేసి పంటలను పరిశీలించారు. భారతదేశంలో పండించే 23 రకాల పంటలలో ఇక్కడ వాతావరణానికి తట్టుకొని ఎక్కువ దిగుబడినిచ్చే రకాన్ని వారు ఎంపిక చేశారు. అట్టి సోయా పంటను ఎంపిక చేసి దానిని విస్తరింప చేయాలన్న ఉద్దేశంతో వారు ఇక్కడికి వచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఉస్మాన్ సాబ్, డైరెక్టర్ అన్జీవరెడ్డి, సోయల్ బేగ్, హసీముద్దీన్, ఇంజనీర్ ఖలీముల్లా హుస్సేన్, తదితరులు ఉన్నారు.