నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశానుసారం ప్రయివేటు హాస్పిటల్ ను మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ శనివారం అకస్మీకంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ప్రైవేట్ హాస్పిటల్ లో గల సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రైవేట్ హాస్పిటల్ లు ఖచ్చితంగా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ను కలిగి ఉండాలని, అగ్నిమాపక కార్యాలయం నుండి అనుమతులు పోందల్సి ఉంటుందని సూచించారు. హాస్పిటల్లోని డయాగ్నస్టిక్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్ రే లను పరిశీలించారు. హాస్పిటల్లోని మెడికల్ షాపులో గల మందులను పరిశీలించారు. ప్రతి మెడిసిన్ కు బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ ను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆసుపత్రి వైద్యులకు అదేశించారు.