పేద ప్రజల రక్తం తాగుతున్న ప్రైవేట్ పాఠశాలలు 

నవతెలంగాణ – ధర్మసాగర్
మండలంలోని ప్రవేట్ పాఠశాలల యజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులతో, పాఠ్యపుస్తకాలు,వివిదరకాల స్టేషనరీ,టై,బెల్టు,దుస్తులు,స్కూల్ టీ షర్టుల అమ్మకాలతో నిరుపేదల  రక్తాన్ని తాగుతున్నారని మండల ప్రజలు, విద్యావేత్తలు,మేధావులు,స్వచ్ఛంద సంస్థ కర్తలు విమర్శిస్తున్నారు. మండలంలోని ప్రైవేట్ పాఠశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన స్థానిక ఎంఈఓ, జిల్లా వైద్యాధికారుల పనితీరులను నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వ వైఫల్యం ఉంటుందని చెప్పకనే చెప్పవచ్చని విమర్శించారు.గ్రామాల్లోని ప్రజలు తమ పిల్లలకు ఉన్నత చదువును అందించాలనే లక్ష్యంతో శయి శక్తుల కాయాకష్టం చేసి,కూలినాలతో బ్రతుకులు ఈడుస్తున్న నిరుపేదలు సైతం తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును ఆలోచించి ప్రవేట్ పాఠశాలను ఆశ్రయిస్తున్నారు. తీరా ప్రైవేట్ పాఠశాల యజమాన్యం నర్సరీకి 10వేల నుంచి 16 వేల వరకు వసూలు చేస్తున్నారని, పాఠశాల అభివృద్ధి కోసం అదనంగా అడ్మిషన్ రూపంలో ఐదువేల రూపాయలను వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా  నర్సరీ పిల్లోడికి పాఠశాలలో ఏబిసిడిలు, జ్ఞాపకశక్తి కోసం రైమ్స్ నేర్పించడానికి దాదాపు 18 నుంచి 20 వేల వరకు ఇంత పెద్ద మొత్తంలో నిరుపేదల నుంచి వసూలు చేయడం జరుగుతుందని వివరిస్తున్నారు. మండలంలోని ప్రైవేటు పాఠశాలలు చదువును వ్యాపారం చేస్తూ వారి ఇష్టమొచ్చిన రీతిలో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలను, స్కూల్ యూనిఫామ్స్ లను, స్టేషనరీ స్కూల్ టైం బెల్ట్ టీ షర్ట్ లను బహిరంగంగా అమ్ముతూన్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీరి ఆకృత్యాలకు అడ్డుకట్టు వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు స్థానిక మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా స్థానిక ఎంఈవో  పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాల యజమాన్యం ఇష్టం వచ్చిన రీతిగా వివరిస్తున్నారని ఆవేదన వ్యక్తం ఇప్పటికైనా స్థానిక ఎంఈఓ ఎండిఓ, డిఇఓ ప్రవేట్ పాఠశాలలో పర్యవేక్షించి నిరుపేదప్రజల రక్తాన్ని తాగుతున్న ప్రభుత్వ యాజమాన్యాలను పర్యవేక్షించి,నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్న వీటన్నిటిని వెంటనే సీజ్ చేయాలని మండల ప్రజలు విద్యావేత్తలు స్వచ్ఛంద సంస్థ కర్తలు మేధావులు డిమాండ్ చేస్తున్నారు.
స్థానిక ఎంఈఓ సత్యనారాయణ రావు వివరణ:
నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాల యజమాన్యం పాఠ్యపుస్తకాలను, స్కూల్ యూనిఫార్మ్స్, ఇతరాత్రా స్టేషనరీ వస్తువులను అమ్ముతున్నారని ఇప్పటివరకు నా దృష్టికి రాలేదు. ఇకమీదట ఇలాంటి చర్యలకు పాల్పడే ప్రైవేట్ పాఠశాలల పై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు పాల్పడకూడదని వారిని  ఈ మధ్యలో కాలంలోనే  క్రూడీకరించి మాట్లాడతామని వివరించారు.