
ప్రైవేట్ స్కూళ్లు.. ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్ -ఏబీవీపీ నాయకులు శనివారం తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ సెలవు దినమైన రెండో శనివారం పాఠశాలలు నడుపుతున్నటువంటి పాఠశాల ముందు ధర్నా చేపట్టి బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందూర్ జిల్లా కన్వీనర్ దామ సునీల్ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ స్థాయి పాఠశాలల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ, విద్యాశాఖ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ, ప్రభుత్వ సెలవు దినమైన రెండో శనివారం పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థులకు విశ్రాంతి లేకుండా మానసిక ఒత్తిడి పెంచుతు. న్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రీతం, ఏబీవీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.