– జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ ప్రధాని పీవీ పై ప్రియంక గాంధీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. పీవీ నరసింహరావును బతికుండగానే కాకుండా, చనిపోయిన తరవాత కూడా అవమానించారని ఆరోపించారు. ఓట్ల కోసం ప్రియాంక పీవీ గురించి చిలక పలుకులు పలుకుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పీవీకీ చేసిన అవమానాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని అన్నారు. పీవీ చనిపోతే ఢిల్లీ లో ఆయన అంత్యక్రియలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. పీవీ నరసింహా రావు కీర్తి,ప్రతిష్టలను గుర్తించిన బీఆర్‌ఎస్ పార్టీనెక్లెస్ రోడ్డు లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పీవీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.