కబడ్డీ విజేతలకు బహుమతుల ప్రదానం

 Adilabadవేమనపల్లి : మండల కేంద్రంలో వేమన యూత్‌ గణేష్‌ మండలి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కబడ్డీ పోటీలను బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోళి వేణుమాధవ్‌ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో జిల్లా వ్యాప్తంగా 27 జట్లు తలపడగా మొదటి బహుమతిగా బూరుగుపల్లి జట్టు రూ.20,000, రెండవ బహుమతి వేమనపల్లి జట్టుకు రూ.10,000 ప్రైజ్‌ మని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కుబిడే మధుకర్‌, సహకార సంఘం చైర్మన్‌ కుబిడే వెంకటేశం, నాయకులు ఉప్పులపు సాయి, పురాణం లక్ష్మీ కాంత్‌, కొండగొర్ల బాపు, మోర్ల మొండి పాల్గొన్నారు.