నవతెలంగాణ – తంగళ్ళపల్లి
క్రీడల్లో గెలుపోటములు సహజమని జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మోర రాజు, ఫిషరీస్ జిల్లా కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామంలో కథ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు ఆదివారం ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… క్రీడా పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాల మధ్య పండగ వాతావరణాన్ని నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మోర శ్రీకాంత్, సామల శ్రీనివాస్, మోర దేవేందర్, సామల గణేష్, మచ్చ వంశీ, ఉడుత సంతోష, ఆడేపు అమర్, మోర కిరణ్, వేముల మల్లెషం, అన్నల్ దాస్ నారాయణ, మోర నర్సయ్య,దేవయ్యా పాల్గొన్నారు.