విద్యార్థులకు స్టేజ్ ఫియర్ పోగొట్టేందుకు బహుమతులు అందజేత.. 

నవతెలంగాణ – కంటేశ్వర్
జడ్పిహెచ్ఎస్ నసుల్లాబాద్ పూర్వ విద్యార్థి, ప్రస్తుతం సదాశివానగర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేయు చున్న గూండ్ల సాయులు తాను చదివిన స్కూల్ విద్యార్థులకు స్టేజ్ ఫియర్ ను పోగొట్టడానికి గత 40 సంవత్సరాలనుండి రిపబ్లిక్ డే జనవరి 26,  ఆగష్టు 15 నాడు ప్రోత్సహక బహుమతులు ఇస్తున్నారు. అందులో భాగంగా గురువారం బహుమతులతో పాటుగా 3000/- విలువగల బ్యాండ్ ను స్కూల్ యాజమాన్యానికి అందజేశారు.  ఈ సందర్బంగా స్కూల్ టీచర్స్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చందర్ తో పాటుగా అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.