
తిరుమలగిరి మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం మండల స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.ఈ పోటీలలో ఆంగ్ల మాధ్యమంలో మోడల్ స్కూల్ విద్యార్థి వి.కావ్య, తెలుగు మాధ్యమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండెపురి విద్యార్ధి పి.మౌనిక ప్రథమ స్థానంలో, అదేవిధంగా జడ్.పి.హెచ్.ఎస్ వెలిశాల గ్రామం నుండి
వై.సాయిప్రసాద్, కస్తూరిబా పాఠశాల నుండి జి.దివ్య , జడ్.పి.హెచ్.ఎస్ తిరుమలగిరి నుండి పి.మనోజ్ లు ద్వితీయ స్థానం లో నిలిచి జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు మండల విద్యాధికారి శాంతయ్య చేతుల మీదుగా బహుమతులు ప్రధాన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాసులు,మంగతాయమ్మ అన్నపూర్ణ, ఎం.జానయ్య, పి.సంజీవ్, హుస్సేన్, మహేష్ మరియు వివిధ పాఠశాలల సోషల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.