
ప్రపంచ బాల కార్మిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రాయింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన విద్యార్థులకు బుధవారం సీనియర్ సివిల్ జడ్జ్ రాధిక జైస్వాల్ బహుమతులు ప్రధానం చేశారు. పట్టణంలోని కుసుమ రామయ్య శివనగర్ పాఠశాలలో జరిగిన డ్రాయింగ్ కాంపిటీషన్ లో అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజము, న్యాయవాద సంఘము అధ్యక్షులు సంజీవరెడ్డి జనరల్ సెక్రటరీ వెంకట్ సి డబ్ల్యూ సి చైర్మన్ అంజయ్య, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.