రామకోటి ముగ్గులపోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

రామకోటి ముగ్గులపోటీ విజేతలకు బహుమతుల ప్రధానం– రామకోటి సంస్థ సేవా కార్యక్రమాలు అద్బుతం
– ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి
నవ తెలంగాణ- గజ్వేల్‌
హిందువులు పవిత్రంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో తాలూకాస్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలో 436 మంది మహిళలు పాల్గొన్నారు. ప్రథమ బహుమతి వేములవాడ చందన, ద్వితీయ బహుమతి తీర్థాల విజయలక్ష్మీ, తతీయ బహుమతి ప్రొద్దుటూరి ప్రేమావతి విజేతలుగా నిలిచారు. వీరికి ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి బుధవారం కష్ణాలయంలో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి మాట్లాడుతూ తెలుగు సాంస్కతిక, సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ముగ్గులు ఉన్నాయన్నారు. రామకోటి సంస్థను స్థాపించి ధార్మిక, సామాజిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్న రామకోటి రామరాజు కషి, పట్టుదల ఆమోఘమని అభినందించారు. 50 మందికి కన్సోలేషన్‌ బహుమతులు కూడా అందజేశారు. సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్‌ బాబు, కష్ణాలయం అధ్యక్షులు ఎలగందుల రాంచంద్రం, దూబకుంట మెట్రాములు, అత్తెల్లి లక్ష్మయ్య, ధార రాంచంద్రం, ఉప్పల మధు, నేతి నాగేంద్రం పాల్గొన్నారు.