గెలుపొందిన జట్టులకు బహుమతులు అందజేత

Prizes will be awarded to the winning teamsనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండలం వంగపల్లి మంగళవారం, యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలో  గెలుపొందిన జట్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  ట్రోఫీలు అందజేశారు. మొదటి బహుమతి రూరల్ పోలీసుల జట్టుకు, రెండవ బహుమతి ట్రాఫిక్ పోలీసుల జట్టుకు, మిగతా జట్టులకు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ కృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజ్ గౌడ్, పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, పన్నీరు భరత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.