నేటి నుంచి ప్రొ కబడ్డీ

నేటి నుంచి ప్రొ కబడ్డీ– తొలి మ్యాచ్‌లో టైటాన్స్‌, బుల్స్‌ డీ
హైదరాబాద్‌ : ప్రొ కబడ్డీ లీగ్‌ (పికెఎల్‌) 11వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. 12 నగరాల ఫార్మాట్‌ నుంచి మూడు నగరాల షోకు మారిన పికెఎల్‌ నేటి నుంచి ఆరంభం కానుంది. గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌, బెంగళూర్‌ బుల్స్‌ తలపడనున్నాయి. తొలి రోజు రెండో మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ, యు ముంబా పోటీపడనున్నాయి. పది సీజన్లు విజయవంతంగా ముగించుకున్న ప్రొ కబడ్డీ లీగ్‌.. ఈ సీజన్‌లో సరికొత్తగా అలరించేందుకు ముస్తాబైందని లీగ్‌ కమిషనర్‌ అనుపమ్‌ గోస్వామి తెలిపారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో 12 జట్ల కెప్టెన్లు, లీగ్‌ నిర్వాహకులు హాజరయ్యారు.
డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణెరి పల్టన్‌, రన్నరప్‌ హర్యానా స్టీలర్స్‌ మరోసారి ఫైనల్స్‌పై కన్నేయగా.. తెలుగు టైటాన్స్‌ వరుస వైఫల్యాలకు చెక్‌ పెట్టాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.