ఎస్సీ కళాశాల బాలికల హాస్టల్ లో సమస్యలు తీష్ట 

Problems in SC College Girls Hostel are acute– నిర్పయోగంగా గ్లిజర్  వాటర్ ప్లాంట్
– హాస్టల్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని విద్యార్థినిల విజ్ఞప్తి
– సర్వేలో సమస్యలు వెలుగులోకి
– పెరిగిన ధరలకు అనుకూలంగా మిస్ చార్జీలు పెంచాలి
– కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుండె మల్లేష్ అడ్వకేట్ 
నవతెలంగాణ – అచ్చంపేట 
ఎస్సీ కళాశాల బాలికల హాస్టల్ లో సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. బాలికల పాఠశాల, కళాశాల లకు సంబంధించిన విద్యార్థులకు ఒకే చోట వసతి ఏర్పాటు చేయడంతో కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలకు అనుకూలంగా మేస్ చార్జీలు పెంచాలని కెవిపిఎస్    జిల్లా ఉపాధ్యక్షులు గుండె మల్లేష్ అడ్వకేట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సంక్షేమ హాస్టల్లో సమస్యలు తెలుసుకునేందుకు సర్వే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే గురువారం పట్టణంలోని బాలికల హాస్టల్ ను సందర్శించారు. హాస్టల్లో కళాశాల విద్యార్థులు 40 మంది, పాఠశాల విద్యార్థులు 55 మంది. మొత్తం 95 మంది విద్యార్థులు. ఉన్నారు. నాసిరికంగా అన్నం, కూరలు పెడుతున్నారని, విద్యార్థినిలు కెవిపిఎస్ బృందానికి తెలిపారు. వేడి నీళ్ల కోసం ఏర్పాటుచేసిన గ్లీజర్ యంత్రం పనిచేయడం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో చలిలో ఇబ్బందులు పడుతూ చల్లనీల్లతో స్నానం చేస్తున్నామని విద్యార్థులు కేవీఎస్ బృందానికి తెలిపారు. పైపులైను మరమ్మతుల కారణంగా ట్యాంకులోకి నీరు పెట్టడం లేదని, 40 నల్లాలు ఉన్నప్పటికీ ఒక్కటి కూడా పనిచేయడం లేదన్నారు. బకెట్లతో నీటిని తీసుకెళ్లి స్నానం చేస్తున్నట్టు వారు తెలిపారు. మినరల్ వాటర్ ప్లాంట్ కూడా నిరూపయోగంగా ఉందన్నారు. ఉదయం పూట టిఫినీలు పూరి ఇడ్లీ పెట్టలని విద్యార్థినిలు విజ్ఞప్తి చేశారు. హాస్టల్ చుట్టూ కాంపౌండ్ నిర్మాణం చేయాలని గ్రౌండ్ ఆటస్థలం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఏఎన్ఎం ను నియమించాలని, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచే విధంగా చూడాలని కోరారు. రాత్రి వేళలో దోమల బెడద తీవ్రంగా ఉంటుందని దోమతెరలు, దోమల నివారణ జట్ కాయిలు ఇవ్వాలన్నారు. సంబంధించిన జిల్లా అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉందని అన్నారు. బాలికల వసతి గృహంలో కనీస సౌకర్యాలు వసతులు కల్పించాలని లేనియెడల కెవిపిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు.