గ్రామాలలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఎంపీడీఓ శ్రీనివాస్

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ముప్పై గ్రామ పంచాయతి పరిదిలోని గ్రామాలలో నెలకొన్న సమస్యలను గ్రామ స్థాయి అధికారులు వెంటనే పరిష్కరించాలని జుక్కల్ ఎంపీడీఓ అన్నారు. గురువారం నాడు  మండల పరిషత్ కార్యాలయంలో వివధశాఖల అధికారులతో సమీక్ష  మమావెశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్,  ఎంపీవో యాదగిరి  మండలంలో ని వ్వవసాయశాఖ, విద్యాశాఖ, జాతీయ ఉపాదీహమీ, మహిళ సంఘాల శాఖ,  సమావేశంలో  మాట్లాడుతు అమ్మ ఆదర్శ పాఠశాలలు, సింగిల్ ఫేజ్ మేటార్లు సంభందించి స్పార్ట్ స్టోర్స్ కలిగి ఉన్నటువంటి వాటికి సింటేక్స్ ట్యాంకులు ఏర్పాటు చేయడం గురించి చర్చించడం జర్గింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపివో యాదగిరి, పంచాయత్ రాజ్ ఏఈ శ్రీనివాస్ రెడ్డి, ఏవో నవీన్ కూమార్, ఐకేపీ ఎపీఎం సత్యనారాయణ, ఎంఈవో రాములు నాయక్ , ముప్పై గ్రామ పంచాయతిల కార్యదర్శులు తదితరులు పాల్గోన్నారు.