గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

నవతెలంగాణ-వీణవంక
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. తమకు కనీస వేతనాలు రూ.19వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం జిల్లా కన్వీనర్ కండె సదయ్య, జిల్లా కమిటీ మెంబర్ కిషన్ రావు ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీపీ కార్మికుల సమస్యలైన జీపీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఇన్స్ర్ రెన్స్ వర్తంపజేయాలని లేకుంటే ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి కొమురయ్య, మిట్టపల్లి సదానందం, దాసారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.