– ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు భరత్
– కేవీపీఎస్ నాయకులు మాణిక్యం రాజు
నవతెలంగాణ- హన్వాడ
మండలంలో ఉన్న హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీిఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు భరత్ ,కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు మాణిక్యం రాజు హాజరై మాట్లాడారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులకు సరైన టాయిలెట్ లేక వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 6 లక్షల రూపాయలు నిధులు మంజూరైన నేటికీ విడుదల కాలేదనిన్నారు.వారం రోజుల్లో నిధులు విడుదల చేయకపోతే మరింత ఉధతం చేస్తామన్నారు. అనంతరం తహసీల్దార్ కిష్ట నాయక్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.ఆయన స్పందించి పది రోజులలో హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనాథ్, వెంకటేష్ ,బాలకష్ణ ,శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు.