నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డి ని బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఎం ఎల్ ఎ స్వగృహంలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల పై శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు గత 11 సంవత్సరాలుగా బదిలీలు మరియు ప్రమోషన్లు లేక ఒకే చోట పనిచేస్తూ తీవ్ర మానసిక క్షోభ కు గురవుతున్నారు కావున వారికి వెంటనే బదిలీలు పదోన్నతులు చేపట్టాలని,010 ట్రెజరీ అకౌంట్ నుండి జీతాలు ఇప్పించాలని,హెల్త్ కార్డులు లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు కావున మిగతా ఉద్యోగుల లాగా వీరికి ఎంప్లాయి హెల్త్ కార్డు ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా మోడల్ స్కూల్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె రవి కుమార్, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, మోడల్ స్కూల్ నాయకులు సతీష్, గంగాప్రసాద్, సాయిలు, గాంధీ తదితరులు పాల్గొన్నారు.