నవతెలంగాణ-డిచ్ పల్లి : తెలంగాణ యూనివర్సిటీ లో నేలకోని ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని కోరుతూ తెలంగాణ యూనివర్సిటీ ఎన్ ఎస్ యుఐ కమిటీ అద్వర్యంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బుర్ర వెంకటేశం కు యూనివర్సిటీ లో ఆదివారం కలిసి సన్మానించి, వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఎన్ ఎస్ యుఐ యూనివర్సిటీ అద్యక్షులు కోమిర శ్రీశైలం మాట్లాడుతూ యూనివర్సిటీలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని, యూనివర్సిటీలో బాలికల వసతి గృహం ఇంకోక్కటి అత్యవసరంగా ఉందని, ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ ఐదు సంవత్సరాల కోర్సులకు ప్లేస్మెంట్స్ కల్పించాలని, లైబ్రరీలో కాంపిటీటివ్ పుస్తకాలు అందుబాటులో ఉంచాలని, గత 2 రెండేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ విడుదల చేయాలని, యూనివర్సిటీలో పనిచేస్తున్న భోధన&బోధనేతర సిబ్బందిని రెగ్యులరైజేషన్ చేయాలని ఇంచార్జీ వైస్ ఛాన్సలర్,హాయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం కు వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు రాజేందర్, బానోత్ సాగర్ నాయక్, నాయకులు విజయ్, నిరంజన్, శ్రీకాంత్, బాలాజీ తదితరులు ఉన్నారు.