సర్కారు బడుల్లో సమస్యలు పరిష్కరించాలి

Problems should be solved in government offices–  గ్రామాల అభివృద్ధిపై పాలకులు శ్రద్ధ పెట్టాలి : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ- చౌటుప్పల్‌
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని, గ్రామాల అభివృద్ధిపై పాలకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
సర్కారు బడుల్లో సమస్యలు పరిష్కరించాలి డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సీడీపీ నిధుల నుంచి మంజూరు చేసిన ఐదు లక్షల రూపాయలతో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం నేలపట్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ మరమ్మతుల పనులకు వారు శంకుస్థాపన చేశారు. మండల పరిషత్తు ఎంపీటీసీ నిధులు రెండు లక్షల రూపాయలతో పద్మశాలి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నేలపట్లలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. సౌకర్యాలు, సమస్యలను ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. శిథిలమైన ప్రాథమిక పాఠశాల బిల్డింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. శిథిలమైన స్కూల్‌ బిల్డింగ్‌ విషయంపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. కొత్త భవనం నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి, విద్య, వైద్యం అందించకుండా మతం పేరుతో అల్లర్లు సృష్టిస్తోందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు, హత్యలు, లైంగకదాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ మతోన్మాదం ముసుగులో యువతను మోసం చేస్తోందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ లబ్ది కోసం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ చౌట వేణుగోపాల్‌గౌడ్‌, నేలపట్ల ఎంపీటీసీ తడక పారిజాతమోహన్‌, చిన్నకొండూరు ఎంపీటీసీ చెన్నబోయిన వెంకటేశం, ఉపసర్పంచ్‌ రంగం అంబాలుకేశవులు, సింగిల్‌విండో డైరెక్టర్‌ పబ్బతి వెంకటేశ్‌గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మణి, కోఆప్షన్‌ సభ్యులు పాలమాకుల యాదయ్య, సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి దబ్బటి బక్కయ్య, సహాయ కార్యదర్శి ఎనమాల సంజీవ, వార్డుసభ్యులు పాల్గొన్నారు.