రోడ్డుపై మురుగునీరుతో అవస్థలు

నవతెలంగాణ – భీంగల్
పట్టణ కేంద్రంలోని 9 వ వార్డులో శివ గల్లి కి వెళ్లే రోడ్డుపై మురికి నీరు నిలువ ఉండడంతో ఆ కాలానికి వాసులు అటుగా వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ వెళ్లేందుకు ఆ కాలనీవాసులకు ప్రధాన మార్గం కావడం వల్ల ప్రతినిత్యం ఆ రోడ్డు గుండా వెళ్లే  ప్రజలు ఆ మురికి నీటి నుండే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కనుక మున్సిపల్ సిబ్బంది స్పందించి రోడ్డుపై మురికి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ కాలనీవాసులు కోరుతున్నారు.