నవతెలంగాణ-ఓయూ: ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మెనేజ్మెంట్ కళాశాల కామర్స్ ప్రొపెసర్ జాస్తి రవి కుమార్ శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా నియమితులయ్యారు. గురువారం వీసీ ప్రొ. ఉమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొపెసర్ రవి కుమార్ ప్రస్తుతానికి ఓయూ జిల్లా పీజీ కేంద్రాల డెరైక్టర్ గా పనిచేస్తున్నారు. గతంలో సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా, యు ఎఫ్ ఆర్ ఓ డెరైక్టర్ గా, సీడీఈ జాయింట్ డెరైక్టర్ గా, పరీక్షల విభాగం ఆడిషినల్ కంట్రోలర్ గా ,సెంటినరి ఉత్సవాల కో ఆర్డినేటర్ గా సేవాలు అందజేశారు. పలు పుస్తకాలు రాసి, జనరల్స్ లో ఆర్టికల్స్ ప్రచురించారు.సుదీర్ఘ పరిపాలన అనుభవంతో పాటుగా గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా పెరు ప్రఖ్యాతులు గడించారు. అయిన శనివారం రిజిస్ట్రార్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయిన వీసీ ప్రొ. ఉమేష్ కుమార్ కు కృతజ్ఞతతలు చెప్పారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.