చీకటి బతుకుల్లో వెలుగులు నింపుతున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్

నవతెలంగాణ – మహాముత్తారం 
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి కంటి సమస్యలతో బాధపడే వారిని కంటి ఆపరేషన్ల కొరకు  సుమారు100 మందిని సొంత ఖర్చులతో ప్రత్యేక  రెండు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసి కరీంనగర్ లోని కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతీ  అలాగే ఇంకో 100 మందికి  త్వరలోనే చేయిస్తానని ఆయన తెలిపారు. అలాగే ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుందని అలాగే నాకు  పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం అని నేను చనిపోయే అంతవరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని అయన అన్నారు.  ఇంకా ఎవరైనా కంటి సమస్యలతో బాధపడేవారు ఉంటే మా ఫౌండేషన్ ని ఆశ్రయించాలని  తెలిపారు. త్వరలో మహాముత్తారంలో క్యాంప్  పెడతామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి ఫౌండేషన్  డివిజన్ ఇంచార్జ్ చెన్నూరు వెంకటయ్య, యూత్ ఇంచార్జ్ చింతకింది రాజు, బల్ల సంతోష్,మహేష్, ఆఫ్రొజ్, తదితర సభ్యులు పాల్గొన్నారు.