
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ వ్యాప్తి వేపధ్యంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ల్యాబ్ టెక్నిస్ మన్లు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేని వని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం కింగ్ కోఠిలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింగ్ కోఠి జిల్లా దవాఖానాలో మెడిక ల్ ల్యాబ్ టెక్నిషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎస్ మూర్తి ఆధ్వర్యంలో జాతీయ ల్యాబ్ టెక్నీషియన్ల దినోత్సవ వేడుకలని ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్య సేవలందించడంలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు.కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య పరీక్షలను నిర్వహించి పేద రోగులకు వైద్య సేవలందించడంలో ల్యాబ్ టెక్నీషీయన్ల పాత్ర మరువలేనిదని అన్నారు. వైద్య రంగానికి వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ముగ్గురు. పిల్లర్లని అన్నారు. వైద్యులు రోగులకు చికిత్సను అందించాలంటే ముందుగా దయాగ్నస్టిక్ చేయాల్సిందే నని, ఆ పాత్రను పరిపూర్ణంగా నిర్వహించి పేద రోగులకు వైద్య చికిత్సలు అందించడంలో ప్రభుత్వ దవాఖానా వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. కోవడ్ సమయంలో కింగ్ కోఠి జిల్లా దవాఖా నా వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు అందించిన సేవలను ఆయన సంధర్భంగా గుర్తు చేశారు. సాధారణంగా ప్రభుత్వ దవాఖానాల పై ప్రజలలో మంచి భావన లేదని, కాగా కోవిడ్ సమయంలో తాను ఓ పేద రోగిని దవాఖానాకు పంపిస్తే మెరుగైన వైద్య సేవలను అందించారని అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామినిచ్చారు. తమ గుర్తింపును తామే ప్రచారం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానాల వైపు ఆర్థిక స్థోమత లేని పేద ప్రజలు వచ్చేలా వైద్య సిబ్బంది తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా పరీ క్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల ఫలితాలు విడుదలై ప్రతి దవఖానాలో ఏర్పాటు వేసేలా చర్యలు తీసుకొని టెక్నీషియన్ల పని భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తానని అన్నారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ముజీబ్ హుస్సేనీ మాట్లాడుతూ.. కోవిడ్ రోజులలో వైద్యులు, నర్సులు, ల్యాబెక్నీషియన్లు. వైద్య సిబ్బంది అందించిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరువరని అన్నారు. ప్రాణాలపై సైతం లెక్క చేయకుండా వైద్య సేవలను అందించారని అన్నా రు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ మాట్లాడుతూ..కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి జిల్లా దవాఖానాలను నోడల్ దవాఖానాలుగా ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. కింగ్ కోఠి జిల్లా దవాఖానాలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించి మంచి పేరు సంపాదించడం జరిగిందని అన్నారు. కింగ్ కోఠి జిల్లా దవాఖానా నోడల్ ఆఫీసర్ డాక్టర్ మల్లిఖార్జున్ మాట్లాడుతూ.. కోవీడ్ సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించామన్నారు.
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ల పదోన్నత్తు తక్షణం కల్పించాలని అధ్యక్షులు ఎమ్ ఎస్ మూర్తి మూర్తి అన్నారు. అలవెన్సులు మంజూరు చేయాలని కోటారు. కేటగిరి పేరును ల్యాబ్ టెక్నాలజిస్ట్ మార్చాలని కోరారు. రూ.2000 సం వత్సరం అనంతరం ఇప్పటివరకు ల్యాబ్ టెక్నీషియన్ల రిక్రూట్మెంట్ జరుగలేదని, దీంతో పెద్దాసుపత్రులలలో వెయ్యి మంది రోగులకు ఇద్దరే ల్యాబ్ టెక్నీషియన్లుఉండటంతో పని భారం అధికమైందని అన్నారు. ఈ సంధర్బంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన ల్యాబ్ టెక్నీషియన్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో దవాఖాన ఆర్ఎంవో డాక్టర్ సాధన, హెచ్ ఓ డి ప్రొఫెసర్ డాక్టర్ జలజ, ఐఎన్టీయూసీమెడికల్ అండ్ హెల్త్ విభాగం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు రెడ్డి, ఉస్మానియా ఆస్పత్రి నర్సింగ్ సూపర్డెంట్ సుజాత రాథోడ్, ఎల్ టి రాజేందర్, భాస్కర్, టీఎన్జీవో కింగ్ జిల్లా దవాఖాన యూనిట్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, నర్సింగ్ సూపర్డెంట్ రజియా, నర్సింగ్ ఆఫీసర్ శైలజ, హెల్త్ సూపర్వైజర్ షాహీద, ఎల్ టి లలిత, నర్సింగ్ ఆఫీసర్ శిరీష రాణి,దవాఖాన వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.