ప్రొ|| మాడభూషి శ్రీధర్‌కు జయశంకర్‌ స్ఫూర్తి పురస్కారం

తెలంగాణ రచయితల వేదిక ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ స్ఫూర్తి పురస్కారం ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌కు ఈ నెల 6 వ తేదీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 6 గంటలకు అందజేస్తారు. జూకంటి జగన్నాథం, జయధీర్‌ తిరుమల రావు, గాజోజు నాగభూషణం గౌరవ అతిథులుగా హాజరవుతారు.
– బూర్ల వేంకటేశ్వర్లు, 9491598040
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం 2024
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం 2024 సంవత్సరానికి కవి అఫ్సర్‌కి ప్రకటించారు. ఈ నెల 14 వ తేదీ సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశమందిరంలో ప్రదానోత్సవం జరుగుతుందని ఇంద్రగంటి జానకీబాల, శీలా సుభద్రాదేవి, మోహన్‌కృష్ణ ఇంద్రగంటి తెలిపారు.
మినీ నవలల పోటీ – 2024
పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మినీ నవలల పోటీ – 2024 నిర్వహిస్తున్నారు. ఏదైనా సామాజిక, పర్యావరణ పరిరక్షణ శాస్త్రీయ, మానవీయ సంబంధాల అంశంతో 30 పేజీలకు తగ్గకుండా నవలలను సెప్టెంబర్‌ 30 లోపు పోస్ట్‌ లేదా కొరియర్‌ ద్వారా పంపాలి. చిరునామా : ఇంనెం. 11-10-694/5, ఖమ్మం 507001. వివరాలకు : 9494773969