మండల కేంద్రంలో మంగళవారం విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో అలుపెరుగని పోరాటం చేసి, తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర పోషించారని, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సేవలను మరువలేని మనీ కొనియాడారు. కార్యక్రమంలో వడ్ల లక్ష్మీరాజం, గాయత్రి ప్రసాద్, వడ్ల స్వామి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.