
ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మండల అధ్యక్షుడు తాటికొండ సదానంద చారి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన జయశంకర్ వారసులు విశ్వబ్రాహ్మణ కులస్తులు నేటి ఆధునిక ప్రపంచంలో వృత్తులు కోల్పోయి జీవనోపాధి లేక ఎన్నోఅవస్థలు పడుతున్నారని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మమ్మల్ని విద్య ఉద్యోగ ఉపాధి కల్పన రంగాలలో విశ్వకర్మ యువతను గుర్తించి తగు న్యాయం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఊకంటి మధుకర్,కస్తూరి రమేష్,రాజు, ఓదెలదేవరాజు, శ్రీనివాస్, మహేష్, బద్రయచారి, జక్కోజురమేష్, పంచకోటి రాజు,లింగమూర్తి, శ్రీనివాస్, నర్సింగోజు రవీంద్రచారి, సంతోష్, కశివోజుల దామోదరచారి, మంతెన శ్రీనివాస్,సూరారం కృష్ణ,రాసమల్ల శ్రీనివాస్,తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.