ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువ లేనివి..

నవతెలంగాణ – పెద్దవూర
ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంత కర్త, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాలను, కష్టాలను.. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారని అన్నారు.ఆశించినట్లే స్వరాష్ట్ర పాలనలో, సకల జనుల సంక్షేమానికి పాటు పడుతూ దేశానికే తలమానికంగా ఆదర్శంగా నేడు తెలంగాణ నిలిచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా మీరు నడిపిన పోరాటం, జీవితం మహోన్నతమైనది. మీరు కలలుగన్న తెలంగాణ ప్రగతి సాక్షిగా మీకివే మా నివాళులు అని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో మన నీళ్లు,మన నిధులు,మన ఉద్యోగాలు కావాలని, కోరుకునే వ్యక్తులలో మొదటి వ్యక్తి జయశంకర్ అని అన్నారు. ఆశయాలను బంగారు తెలంగాణ కోసం నిత్యం తపించే గొప్ప ఆదర్శవాది అని అన్నారు. వారి అకాల మరణం తెలంగాణ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని అన్నారు.ఈ కార్యక్రమం లో పౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.