ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ కల్పించడంతో హర్షం..

నవతెలంగాణ – చివ్వేంల
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరామ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ కల్పించడంతో తెలంగాణ జన సమితి మండల పార్టీ అధ్యక్షులు సుమన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు… ఈ సందర్భంగా ఆదివారం స్థానిక విలేకరులతో  మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమము ఉవ్వెత్తున సాగుతున్న క్రమము 2009లో ప్రారంభమైనప్పుడు అన్ని పార్టీలను ఒక్క తాటిపైకి  తెచ్చి జేఏసీగా ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వారి  పిలుపుమేరకే ఆనాడు ఊరు ఊర జేఏసీలుగా ఏర్పడి వారి పిలుపునందుకొని ప్రతి యూనివర్సిటీ, ప్రతి ఊరు, ప్రతి పల్లె ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి పడిందన్నారు. వారి పిలుపు మేరకే సాగరహారం మిలియన్ మార్చ్  అనేక రాస్తారోకోలు , బందులు ,బైకాడ్లు మరియు వంట వార్పు, బతుకమ్మలు చేయడం ,బోనాలు చేయడం ,మొత్తం తెలంగాణ సంస్కృతిని మరొక్కసారి ప్రపంచానికి తెలియపరచిన మహామేధావి  కోదండరాం అన్నారు.  తెలంగాణ వచ్చేంతవరకు అనేకమంది నాయకులకు ముఖ్యంగా కేసీఆర్ కి సలహాలు సూచనలు ఇస్తూ ఉద్యమాన్ని ముందుండి నడిపిన మహా మేధావి ప్రొఫెసర్ కోదండరాం అని  వారికి ఈనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నతమైన స్థానం కల్పించి ఎమ్మెల్సీగా పదవి యిచ్చి  వారి సలహాలు సూచనలు  ఎంతో అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం సంతోషకరం అన్నారు.