
నవతెలంగాణ – జుక్కల్
మండలంలో వేరుశనగ పండించే రైతులు రూటు మార్చారు… రాటుదేలారు. మండలంలో గతంలో వేల ఎకరాలలో పండించేవారు, తరువాతీ కాలంలో పంటను వందల ఎకరాలకు పరిమితం అయింది. ఒకప్పుడు వేరుశెనగ పంట వివరివిగా పండించిన రైతులు ఇరువై ఎండ్లుగా పంట కనుమరుగై పోయింది. అక్కడక్కడా రైతులు పండించేవారు. ప్రస్తుతం గత రెండు మూడేళ్లుగా రైతులు వేరుశెనగ పంట వైపు మెుగ్గు చూపుతున్నారు, ఒకరికి ఒకరు పండించే విదానాలను నయాపద్దతిలో మల్చింగ్ విదానంలో అధిక దిగుబడి సాదీంచేందుకు చూసి పంటను పండించేందుకు ఆసక్తిగా ముందుకు వచ్చారు. దీనికి తోడు మార్కేట్ లో వేరశెనగకు మంచి ధర పలుకుతోంది. పచ్చి పల్లి కూడా మార్కేట్ లో మంచి డిమాండ్ ఉండటం, వైద్యులు వేరుశెనగ నూనేను వాడాలని హృదయ రోగులకు సూచించడం పట్టణాలలో మంచి డిమాండ్ ధర పలుకడం రైతులకు కలిసి వచ్చిందని పలువురు రైతులు తెలిపారు.
పచ్చి పల్లి కాయకు మంచి డిమాండ్: మార్కేట్ లో పచ్చి పల్లి కాయకు ప్రజలు చాల ఇష్టంగా వాడుతుంటారు. ప్రయాణ యమయంలలలో కాల్చిన పల్లికాయ టెస్టే వేరుగా ఉంటుంది , ఎక్కడ జన సంచారం ఉన్న అక్కడ పల్లిలు అమ్మేవారు ఉంటారు. దీంతో పాటు మంచి పౌష్టక ఆహరంగా కూడా ఉంటుంది.
మార్కేట్ సదుపాయలు లేవు: జుక్కల్ ప్రాంతంలో మార్కేట్ సదుపాయం లేక పోవడంతో మహరాష్ట్ర , కర్ణాటక ప్రాంత నగరాలలో మార్కేట్ కు తరలిస్తారు. కొంత మంది రైతులు నూనే గానుగ అడించే వారికి , దళారులకు అమ్మెస్తుంటారు.
ఖర్చు ఎక్కువే : వేరుశెనగ పంచను పండించే రైతు ఎకరాకు నలుపై నుండి యాబై వేలు ఖర్చు పెట్టాల్సిందే. క్వీంటాల్ పల్లి విత్తనం రేటు పదహేను వేలు ఉంది. వీటితో పాటు ఇతర ఖర్చులు పట్టుకుని సుమారుగా బాగానే ఖర్చులుంటాయి.
పల్లిపంట సాగు పెర్గింది: పల్లి పంట సాగు గతం కంటే పెర్గింది. ఇరువై ఎండ్ల క్రిత విరివిగా పండించే వారు, మద్యలో గ్యాప్ వచ్చింది. ఆధునిక శాస్త్ర్ర విధానలను అందిబుచ్చుకుని ప్రస్తుతం విద్యావంతులైన యువ రైతులు పంచల సాగు బాగానే చేయడం గమానర్హం