– జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్
నవతెలంగాణ-తాండూర్
పర్యావరణాన్ని పరిరక్షించడంతో ప్రగతిని సాధించవచ్చునని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ తెలిపారు. శుక్రవారం తాండూర్ కస్తూర్బా పాఠశాలలో ఏర్పాటుచేసిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. తాండూర్ సీఐ కిరణ్ కుమార్ ఎంపీడీఓ శ్రీనివాస్ ఏఓ కిరణ్మయితోపాటు స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమం పండగ వాతావరణం తలపించింది. కస్తూర్బా విద్యార్థినులు అధికారులకు జాతీయ జెండాలు పట్టుకొని స్వాగతం పలికారు. ఈ సందర్భవంగా డీఆర్‌డీఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణంసమతుల్యతా, పకృతి వల్ల కలిగే లాభాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పెరుగుతున్న జనాభా పారిశ్రామికరణ అవసరాల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని మానవమనగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో చెట్లు నాటే కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని సూచించారు. గ్రామపంచాయతీ అధికారులు గ్రామాల్లో చెట్టు నాటే కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా పూలు పండ్లు ఔషధ గుణాలకు సంబంధించిన మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ ఐకేపీ సిబ్బంది నాయకులు బాలయ్య, సూరం రవీందర్, మాసాడి శ్రీదేవి, ఉమారాణి, కస్తూర్బా ఎస్‌ఓ సుమన చైతన్య, ఎంపీఓ అనిల్ ఎస్‌ఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
జైపూర్ : భీమారం మండలంలోని కాజిపల్లి జీపీలో శుక్రవారం స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ వన మహోత్సవం కార్యక్రమంలో 250 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, ఏపీఓ పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.
జన్నారం : ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌కు ప్రతి ఒక్కరు సహకరించాలని ఇందన్‌పల్లి ఎఫ్‌ఆర్‌ఓ ఆఫీసొద్దీన్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఇందన్‌పల్లి జడ్పీఎస్‌ఎస్ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాల నుంచి ఇందన్‌పల్లి గ్రామంలో విద్యార్థులతో అటవీ అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పూర్తిస్థాయిలో సంరక్షించి వృక్షాలు తయారు చేసినప్పుడే మంచి ఫలితం ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ, డిఆర్‌ఓ హనుమంతరావు సెక్షన్ ఆఫీసర్ రవి, కృష్ణారావు, అమృతరావు, బీట్ ఆఫీసర్ ఎండీ ముజీబ్‌రబ్బాని, రాజేశ్వరరావు పాల్గొన్నారు.
తిమ్మాపూర్‌లో స్వఛదనం-పచ్చదనం
మండలంలోని తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో గ్రామ స్పెషల్ ఫీసర్ మండల వ్యవసాయ శాఖ అధికారి సంగీత ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు మొక్కలు నాటారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి మీరు పోసి సంరక్షించాలని సూచించారు. గ్రామంలో ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటించాలని సూచించారు కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లావణ్య పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్, అంగన్వాడీ టీచర్లు జాడి సంజీవరాణి గంజాయిల జమున, ఫీల్డ్ అసిస్టెంట్ భూమయ్య హెల్త్ అసిస్టెంట్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి : ప్రభుత్వ జూనియర్ కళాంశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆద్వర్యములో శుక్రవారం స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించి తొలగించి పరిసరాలను శుభ్రం చేసి వివిధ రకాల పూలు పండ్ల మొక్కలను నాటారు. అనంతరం స్వచ్ఛదనం – పచ్చదనం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస రావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఇన్‌చార్జి ఎం రామయ్య, అధ్యాపకులు అమరున్నీషా, జి శ్రీనివాస్, కె చంద్రకళ, కె జగన్ మోహన్, ఈ ప్రభాకర్, పి ప్రదీప్, ఎం కోటేశ్వర్, ఎస్ భానేష్ ఎండీ వజీర్, శ్రీకాంత్, అనిత, విద్యార్థిని విదార్థులు పాల్గొన్నారు.
తాండూర్ : బోయపల్లి పంచాయితీలో స్పెషల్ ఆఫీసర్ కిరణ్మయి శుక్రవారం మాజీ మండల అధ్యక్షులు మాసాడి శ్రీదేవితో కలిసి స్వచ్ఛతనం-పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయితీ ఆఫీస్‌లో మొక్కలు నాటించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాసాడి తిరుపతి, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఎఫ్‌ఏ చంద్రయ్య పాల్గొన్నారు .