
ఈ విద్యా సంవత్సరం పూర్తి కావడంతో ఆయా పాఠశాలలలో విద్యార్థులకు ప్రగతి పత్రాలు (ప్రోగ్రెస్ కార్డ్స్ )లను అందజేశారు. మండలంలోని ముత్తుకూరు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎంఈఓ స్వామి, ప్రధానోపాధ్యాయుడు దినేష్ ల చేతుల మీదుగా విద్యార్థులకు పత్రాలను అందజేశారు. చదువులో విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేసిన ఉపాధ్యాయులను ఎంఈఓ తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జావిద్, గంగాధర్, పద్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.