మార్పు కోరే నాయకునికి ఓటు వేస్తామని హామీ ఇవ్వండి

– మీ ఓటుతో గెలిచి పనిచేయని ప్రజాప్రతినిధినీ ఇంటికి పంపండి -మలహర్
– మండల సోషల్ మీడియా ఇంఛార్జి అక్కినవేని సుమన్
నవతెలంగాణ- మల్హార్ రావు:
బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాఘవ రెడ్డి ఎడ్లపల్లి గ్రామం ఇంఛార్జి వాల యాదగిరి రావు ఆదేశానుసారం గ్రామ నాయకులు, భారాస శ్రేణులు కేసిఆర్ మ్యానిఫెస్టో ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధన్న హామీలను ఎడ్లపల్లి గ్రామంలో గడప గడపకు ప్రచారం చేశారు.మీ మార్పు, మంథని అభివృద్ధికి పాటుపడే నాయకుడు పుట్ట మధు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అక్కినవేని సుమన్ కోరారు. ఒకసారి ఓటు వేసి ఐదు ఎండ్లు సేవ చేసే నాయకుడిని ఎమ్మెల్యే గా ఎన్నుకోవాలని, మీ ఓటుతో గెలిచి పనిచేయని ప్రజాప్రతినిధినీ ఇంటికీ పంపాలని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా మీ పాలకుడు ఉండాలంటే ఆలోచించి ఓటు వేయాలని, పనిచేసేవారికే అధికారం దక్కాలంటే మీ ఓటు పై సరియైన నిర్ణయం చేయాలని మండల సోషల్ మీడియా ఇంఛార్జి అక్కినవేని సుమన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు పంతకాని వెంకట్ రాజు, వార్డు సభ్యులు మంథని బాపు, తోట స్వరూప రమేష్, అక్కినవేని రాధ శ్రీనివాస్, గ్రామ నాయకులు పిలమరి నరేష్, రంజిత్, కునారపూ శ్రీనివాస్, విష్ణు, రాజు, మంథని బుచ్చయ్య, కుక్కల రాజబాబు, జనగామ రాజేష్, తోట సత్యనారాయణ మరియు మహిళా నాయకులు,యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.