కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ అన్నారు.
గీసుకొండ మండలం కొనయమాకుల గ్రామంలో ఈరోజున తెలంగాణ రైతు సంఘం గీసుకొండ మండల కమిటీ సమావేశం బరుపటి రవీందర్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రత్యక్షంగాను,పరోక్షంగాను నేటికీ 75% మందికి ఉపాధినిస్తున్న మన వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టివేయబడిందని అన్నారు, మారుతున్న సాంకేతిక, నాగరిక విలువలకు తగిన విధంగా వ్యవసాయ రంగాన్ని చేయడంలో ప్రభుత్వాలు ప్రణాళిక బద్ధంగా, నిర్మానాత్మకంగా పని చేయడంలో చిత్తశుద్ధి చూపలేక పోయిన కారణంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా నష్టాల్లోనే మూతపడుతున్నాయి. లక్షలాదిమంది కార్మికులు, ఉద్యోగులు నీ రాశేయులుగా మారిపోతున్నారు. ప్రభుత్వాలు, రైతాంగానికి అర కొర సదుపాయాలు పేరుతో నగదు సహాయాలను అందిస్తూ రైతాంగం వ్యవసాయాన్ని నెట్టుక వచ్చేలా చేస్తున్నారు కానీ శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాలు ఆలోచించకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన గ్రామ కమిటీలు నిర్మించుకొని రైతులకు ప్రభుత్వాలు ఇచ్చే ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చేలా రైతంగ ఐక్యతగా ఉద్యమాలను నిర్మించుటకు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు, రైతాంగానికి శ్రీనివాస్ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఊరటి అంశాల్ రెడ్డి గీసుకొండ మండల ప్రధాన కార్యదర్శి వజ్ర రాజు జిల్లా కమిటీ సభ్యులు మోకిడి పేరయ్య మండల కమిటీ సభ్యులు రామారావు సాంబశివరావు రాజు బిల్లా హేమంత్ శ్రీధర్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.