నవతెలంగాణ – రెంజల్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం రైతు సమస్యలపై స్థానిక తహసిల్దార్ శ్రావణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పుట్టి నడిపి నాగన్న మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రూ.500 బోనస్, రైతు భరోసాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పరికోతలు చివరి దశకు వచ్చినప్పటికీ ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం సూచనియమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సన్నరకం, దొడ్డు రకం ధాన్యానికి రూ.500 బోనస్ తప్పకుండా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ, కార్మిక సంఘం నాయకులు వడ్డెన్న, ఎస్కే నసీర్, సిద్ధ పోశెట్టి, గోపాల్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.