
నవతెలంగాణ – గోవిందరావుపేట
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు బొమ్మెర బోయిన వీర బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు బిజెపి మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు ఆధ్వర్యంలో మండల కిసాన్ మోర్చా సభ్యులతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన వీర బిక్షం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడాన్ని బిజెపి కిసాన్ మోర్చా తీవ్రంగా నిరసిస్తున్నదనీ, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయలు వ్యవసాయ రుణాన్ని బేషరతుగా మాఫీ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకి కట్టుబడి రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద ఖరీఫ్ రబీ కలుపుకొని 15 వేల రూపాయల ఆర్థిక తోడ్పాటు అందించాలన్నారు. కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆర్థిక సహకారం అందించాలి. వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి 12000 వెంటనే అమలు చేయాలనీ, తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజన ను వెంటనే అమలు చేయాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ సృజన్ కుమార్ కు అందించారు. తాసిల్దార్ సృజన్ కుమార్ మాట్లాడుతూ డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రచార కార్యదర్శి రుద్రారం సురేష్, మూల కుమార్ మండల కార్యదర్శి, కందాల రవీందర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు, కుమ్మరి కుంట్ల సదానందం, బొల్లంపల్లి మురళి, కుసుమ కిషోర్, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, బెల్లి లింగయ్య, మూల రంగారెడ్డి, తుక్కని మధుకర్ రెడ్డి, కర్ణగంటి శ్రీకాంత్, వాసం స్వామి, మారబోయిన శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.