కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ముదిరాజులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ముదిరాజుల మహాసభ మండల అధ్యక్షుడు సూర్య శంకర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వాళ్ళు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ నరేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అభయ హస్తంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వీరమల్ల సైదులు, ముదిరాజ్ కొంపల్లి సొసైటీ కార్యదర్శి సూర శంకర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు సుక్క శ్రీశైలం, వనం బిక్షం, కొంక యాదయ్య, పులకరం ఆంజనేయులు, సూర మహేష్ , సుర వెంకటేశం, సూర రమేష్ , వనం గిరి, వనం శ్రీను, వనం సైదులు తదితరులు పాల్గొన్నారు.