పదోన్నతి పొందిన ఆర్మూర్ ఎసిపి ప్రభాకర్ రావు

నవతెలంగాణ – ఆర్మూర్
హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఉత్తర్వుల ఆదేశానుసారం తెలంగాణలోని పలువురు పోలీస్ అధికారులకు పదోన్నతులు లభించగా జిల్లాలోని ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాయల ప్రభాకర్ రావు అదనపు ఎస్పీగా పదోన్నతి పొందినారు. ఈ సందర్భంగా శనివారం రూరల్ సిఐ గోవర్ధన్ రెడ్డి, స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు,, ఎస్సైలు రాము, శివరాం లు శుభాకాంక్షలు తెలిపారు.