సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య..
నవతెలంగాణ – మునుగోడు
చాలీచాలని వేతనాలతో ఏళ్ల తరబడి నుండి ఎట్టి సాకిరి చేస్తున్న ఆశాలకు ఏఎన్ఎం, జిఎన్ఎం లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరల కనుగుణంగా ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ. 18000 వేలు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశాలకు నష్టం కలిగించే పరీక్ష పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. ఆశాలకు ఇన్సూరెన్స్ 50 లక్షలు చెల్లిస్తూ ఇన్సూరెన్స్ జారీ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. ఐదు లక్షల చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ప్రతి సంవత్సరం20 రోజుల వేతనంతో కూడినక్యాజువల్ సెలవులు ఇవ్వాలని, ఆరు నెలలు వేతనంతో కూడిన మెడికల్ సెలవు ఇవ్వాలనిఆయన రాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిపి, షుగర్ టెస్టులు, ఎన్ సి డి, అబా కార్డ్స్ ఇలాంటి పనులు ఏఎన్ఎంలు చేస్తారు. కానీఆశ వర్కర్లతో చేయిస్తున్నారనివారు ఆవేదన వ్యక్తం చేశారు. 2022, 2023, 2024 సంవత్సరముల లెప్రసీ సర్వే పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
గత ప్రభుత్వంఎన్నికల హామీ ప్రకారంప్రసూతి సెలవులు ప్రకటిస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదనివారు అన్నారు. మూడు సంవత్సరాల పెండింగ్ యూనిఫామ్ వెంటనే ఇవ్వాలని,ఆశాలకు పనిబారం తగ్గించాలని జాబ్ చార్జ్ ఇవ్వాలని ఆయన అన్నారు.జిల్లా అధికారులుఆశాలతో స్కూటమ్ డబ్బాలను మోపించకూడదని ప్రభుత్వం నిర్దిష్టమైన సర్కులర్ జారీ చేయాలని ఆయన అన్నారు.అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించిన ఆశా వర్కర్లకు డబ్బులు చెల్లించాలనిఆయన అన్నారు. అనేక సంవత్సరాల నుండిపెండింగ్లో ఉన్న రిజిస్టర్ ను అత్యంత తొందరగా ప్రింట్ చేసి ఆశాలకు అందించాలని ఆయన అన్నారు. గత ఎన్నికల ముందుకాంగ్రెస్ ప్రభుత్వంఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలనుఅమలు చేయకపోతేరాబోయే కాలంలోఉద్యమాలు ఉధృతం చేస్తామనివారు హెచ్చరించారు. జులై 2021 నుండి డిసెంబర్ 6 వరకు ఆరునెల పిఆర్ సి ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, సీఐటీయూ చండూరు మండల కన్వీనర్లు వరికుప్పల ముత్యాలు, జెర్రీపోతుల ధనంజయ గౌడ్,ఆశా వర్కర్ల సంఘంజిల్లా ఉపాధ్యక్షులురమావత్ కవిత,జిల్లా కమిటీ సభ్యులు జంపాల వసంత, నీల జ్యోతి, పద్మ,లలిత, పందుల పద్మ, అందుగుల యాదమ్మ, పోలే మమత, మునుగోటి కవిత, నాగమణితదితరులు పాల్గొన్నారు.