వాణిజ్య పంటలకు ప్రోత్సాహం పండ్లు, కూరగాయ పంటల విస్తర్ణకు ప్రణాళికలు

3వేల ఎకరాల్లో అయిల్‌ఫామ్‌ సాగు టార్గెట్‌ వాణిజ్య పంటల సాగుకు సబ్సిడీ జిల్లాలో 4 వేల ఎకరాల్లో వాణిజ్య పంటల సాగుకు ప్రణాళికలు– 3వేల ఎకరాల్లో అయిల్‌ఫామ్‌
– సాగు టార్గెట్‌ వాణిజ్య పంటల సాగుకు సబ్సిడీ
– జిల్లాలో 4 వేల ఎకరాల్లో వాణిజ్య పంటల సాగుకు ప్రణాళికలు
వాణిజ్య పంటల విస్తర్ణకు రైతులకు ప్రోత్సాహకంగా సబ్సిడీ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మార్కెట్‌లో డిమాండ్‌ కలిగిన పంటలను సాగు చేసేందుకు రైతులను ప్రోత్సాహించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. దీంతో ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వాణిజ్య పంటల సాగుతో కలిగే లాభాలు ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహంపై అవగాహన కల్పిస్తూ.. రైతులను వాణిజ్య పంటల సాగు వైపు మళ్లీంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ను మించి జిల్లాలో వాణిజ్య పంటల సాగు విస్తీర్ణనాన్ని పెంచేందుకు ఉద్యానవన శాఖ అధికారులు టార్గెట్‌గా తీసుకున్నట్టు తెలుస్తుంది. రైతులు లాభాలను ఇచ్చే పంటలను సాగు చేసేందుకు ముందుకు రావాలని అధికారులు రైతులుకు సూచిస్తున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలో వాణిజ్య పంటలకు భలే డిమాండ్‌ ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం 29 వేల ఎకరాల్లో పండ్ల తోటలు సాగు అవుతుండగా, 29 వేల ఎకరాల్లో కూరగాయాల పంటలు సాగు అవుతున్నాయి. ఫారుఖ్‌నగర్‌, కేశంపేట, తలకొండపల్లి, ఇబ్రహీంపట్నం, యాచారం, మొయినబాద్‌ ప్రాంతాల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. కూరగాయాల తోటలు మహేశ్వరం, శంషాబాద్‌, కందుకూరు, మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నంలో కూరగాయాల పంటలు సాగు చేస్తున్నారు. పూలతోటలు చేవెళ్ల, మహేశ్వరం, శంషాబాద్‌, మొయినాబాద్‌ ప్రాంతాల్లో 4 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అయిల్‌ ఫామ్‌ ప్రస్తుతం జిల్లాలో 512 ఎకరాలు సాగు అవుతుంది. ఈ ఏడాది మరో 4 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణనాన్ని పెంచేందుకు ఉద్యానవన అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
హైదరాబాద్‌ సిటీ జనాభా అవసరాల నిమిత్తం సిటీ ప్రజలు ఇతర జిల్లాలపై ఆధారపడుతారు. దీంతో హైదరాబాద్‌ శివారు ప్రాంతాలపై ఎక్కువగా ఆదారపడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో వ్యాణిజ్య పంటల విస్తీర్ణణాన్ని పెంచాలని టార్గెట్‌గా తీసుకుంది. వాణిజ్య పంటల సాగు రైతులకు సబ్సిడీతో ప్రోత్సాహించనుంది.
4 వేల ఎకరాల్లో వాణిజ్య పంటల సాగుకు ప్రణాళికలు
జిల్లాలో విస్తరంగా వాణిజ్య పంటలను సాగు చేసేందుకు ఉద్యానవన శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది 4 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలను సాగు చేసేందుకు టార్గెట్‌గా తీసుకున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. ఇందులో అత్యధికంగా 3 వేల ఎకరాల్లో అయిల్‌ ఫామ్స్‌ను సాగు చేసేందుకు చిన్న సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ అందించనుంది. అయిల్‌ ఫామ్‌ పంట సాగు ఒక ఎకరంలో 57 మొక్కలు సాగు చేయాల్సి ఉంది. ఒక్కో మొక్కకు రూ. 20 చొప్పున ఒక ఎకరంలో సాగు చేసేందుకు రూ.1140 చెల్లించాల్సి ఉంది. డ్రిప్‌ ఇరిగేషన్‌కు కూడా సబ్సిడీ ప్రభుత్వం కల్పించనుంది. 357 ఎకరాల్లో పండ్ల తోటలను సాగు చేసేందుకు రైతులకు 40 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. 102 ఎకరాల్లో ఈ ఏడాది కూరగాయాల పంటలను సాగు చేసేందుకు 90 శాతం సబ్సిడీతో నారు అందించి రైతులను ప్రోత్సాహించనుంది. పూల తోటలకు సబ్బందించి 40 శాతం సబ్సిడీతో ఈ ఏడాది 187 ఎకరాలను సాగు చేసేందుకు రైతుకు సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక ప్లాస్టిక్‌ మంచింగ్‌ కవర్‌కు 40 శాతం సబ్సిడీతో 250 ఎకరాలకు సబ్సిడీ అందించనుంది.
మార్కెట్‌ డిమాండ్‌ పంటలు సాగు చేయాలి
హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ఉంది. జిల్లాలో పండించిన వాణిజ్య పంటలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. మార్కెటింగ్‌ అందుబా టులో ఉంది కావున. రవాణ ఖర్చులు కూడ తక్కువగా ఉంటా యి. రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కూరగాయాలు, పూవ్వులు, పండ్లతోటల సాగుతో రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ పంటల సాగుకు ప్రభుత్వం సబ్సిడీతో ప్రోత్సాహం అందిస్తోంది. రైతులు లాభాలను చూడాలంటే వాణిజ్య పంటల సాగు వైపు మొగ్గుచూపాలి.
నీరాజగాంధీ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి