జూనియర్ లైన్ మెన్లకు అసిస్టెంట్ లైన్ మెన్లుగా ప్రమోషన్స్

Promotions of Junior Linemen to Assistant Linemenనవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం డివిజన్ విద్యుత్ శాఖ పరిధిలో పలువురు జూనియర్ లైన్ మెన్లకు అసిస్టెంట్ లైన్ మెన్లుగా ప్రమోషన్స్ వచ్చినట్లుగా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాటారం డివిజన్ ఐదు మండలాల పరిధిలో 18మంది జెఎల్ఎంలు.. ఏఎల్ ఎంలుగా పదోన్నతులు సాధించారు.మహాదేవపూర్ సెక్షన్ నుంచి నార్ల సతీష్, వినయ్,రాజు, హరిశంకర్.కాటారం నుంచి ముగ్గురు, కొయ్యుర్ సెక్షన్ పరిధిలో ఇద్దరు, మహముత్తరాం నుంచి ఐదుగురు ప్రమోషన్ పొందినట్లుగా తెలిపారు.ఇందులో రుద్రారం గ్రామానికి నార్ల సతీష్ ఉన్నారు.