
విద్యుత్ సంస్థలో 2019 సంవత్సరములో జూనియర్ లైన్మెన్ గా ఉద్యోగంలో చేరి ఇప్పటివరకు సక్రమంగా విధులు నిర్వహించిన డివిజన్ జేఎల్ఎం 57 మందికి ప్రమోషన్లు పొందినట్టు విద్యుత్ శాఖ డి ఈ హరిచంద్ నాయక్ శుక్రవారం తెలిపారు. ఎన్ ఐ డి సి ఎల్ జేఎల్ఎం ను లకు, సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు డివిజన్లో 57 మంది ఏ ఎల్ ఎం గా ప్రమోషన్లు పొందినారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకముగా కలిసి శాలువా బొకేతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంచి పెడుతూ టపాకాయలు కాల్చినారు . ఈ కార్యక్రమంలో డివిజన్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కే నరేందర్ నాయక్ ,కన్వీనర్ సల్ల శ్రీనివాస్ యాదవ్ సంజీవ్ ,, నర్సయ్య, ఎండి షకీల్ , రామ్చందర్ వేణుగోపాల్, సురేష్ బాబు అనిల్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.