
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని నడ్పల్లి గ్రామ పంచాయతీ గ్రేడ్ వన్ కార్యదర్శి నిట్టు కిషన్ రావుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచి నందుకుగాను ప్రశంసా పత్రం ను అందుకున్నారు. ఈ సందర్భంగా నడ్పల్లి మేజర్ గ్రామ పంచాయతీ గ్రేడ్ వన్ కార్యదర్శి నిట్టు కిషన్ రావు “నవ తెలంగాణ”తో మాట్లాడుతూ.. ఈ ప్రశంస పత్రం తో మరింత బాధ్యతను పెంచిందని గ్రామ పంచాయతీ పరిధిలో పచ్చదనం పరిశుభ్రత, 100% ఇంటి పన్నుల వసూలు, మురుగు కాలువల పరిశుభ్రత తదితర వాటిపై గ్రామ ప్రజల సహకారంతో గ్రామ పంచాయతీ పరిధిలో రహదారులపై చేత్త చేదరం, మొక్కల సంరక్షణకు చర్యలు చేపడతానన్నారు. ప్రశంసా పత్రం లాబించడంతో గ్రామపంచాయతీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు నిట్టు కిషన్ రావుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.