పాల్వాయి కుటుంబంలో ఆస్తి తగాదాలు 

Property disputes in the Palwai family– మా బిడ్డను కిడ్నాప్ చేశారంటూ ఆందోళన
– పాల్వాయి స్రవంతి  రెడ్డిపై ఆమె సోదరుడి ఆరోపణలు
నవతెలంగాణ – చండూరు
మాజీ రాజ్యసభ సభ్యుడు  పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబంలో ఆస్తి తగాదాలు  నెలకొన్నాయి. మంగళవారం రాత్రి గోవర్ధన్ రెడ్డి పెద్ద కుమారుడు పాల్వాయి శ్రావణ్  కుమార్ రెడ్డి దంపతులు తమ ఇడికూడా గ్రామానికి చెందిన కొంతమందితో కలిసి తమ బిడ్డను కిడ్నాప్ చేశారంటూ  స్థానిక చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ.. ఈనెల 11న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తమ బిడ్డను  సోదరి  బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు  పాల్వాయి స్రవంతి రెడ్డి  కిడ్నాప్ చేశారంటూ ఆరోపించారు. 12న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు. 13 న నల్గొండ డిఎస్పి కార్యాలయానికి తమ బిడ్డను పాల్వాయి స్రవంతి   రెడ్డి తీసుకువచ్చి కోర్టులో హాజరు పరిచిందని  తెలిపారు. పోలీసులు కూడా పాల్వాయి స్రవంతి  కె వత్తాసు పలుకుతున్నారని, కిడ్నాప్ కేసును సివిల్ కేసుగా  మార్చుతున్నారని వారు పోలీసులు పై ఆరోపణలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని బాలిక చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంరక్షణలో ఉందని, తగిన న్యాయం చేస్తామని చండూరు సిఐ వెంకటయ్య హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.