నూతన వైన్ చాన్స్ లర్ ను కలిసిన ప్రవేట్ కళాశాలల యాజమాన్యం

Proprietorships of private colleges meet new wine chancellorనవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న ప్రొఫెసర్ కాజా అల్తావ్ హుస్సేన్ ను ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంజి యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాల అధ్యక్షులు మారం నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కళాశాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రవేట్ కళాశాలల రాష్ట్ర అధ్యక్షుడు డా. బి. సూర్యనారాయణరెడ్డి, గౌరవ అధ్యక్షలు గింజల  రమణా రెడ్డి, యూనివర్శిటి ఈసీ మెంబర్లు డా. భాస్కర్ రావు, ప్రవీణ్ కుమార్, అంగ య్య గౌడ్, రాం మోహ్రాన్, ఆదిత్య, సామ్యాట్, సభ్యంగౌడ్, జానయ్య గౌడ్, యాదగిరి, నర్సింహారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.