యాదాద్రిభువనగిరి జిల్లా హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉండి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు దేశపాక శ్రీనివాస్ గురువారం టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ను పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో కలిసి వినతిపత్రం సమర్పించారు.సౌత్ పార్ట్ విజయవాడ జాతీయ రహదారిపై నార్త్ పార్ట్ వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రిభువనగిరి జిల్లా విస్తరించి ఉన్నది, కానీ అభివృద్ధికి, చౌటుప్పల్ బీబీనగర్ మండలాలో పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం నుండి యాదాద్రిభువనగిరి జిల్లా ప్రజలు అనేక మానసిక రుగ్మతలకు ఇబ్బంది పడుతున్నారని శ్రీనివాస్ కోదండరాం కు వివరించారు.తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని కోదండరాం హామీ ఇచ్చారని దేశపాక శ్రీనివాస్ తెలిపారు.ముఖ్యంగా చౌటుప్పల్ మండలం కాలుష్యంతో కనుమరుగయ్య పరిస్థితి ఏర్పడిందని శ్రీనివాస్ అన్నారు. అదేవిధంగా రామన్నపేట మండలం అంబుజా ఫ్యాక్టరీ ప్రజలతో చెలగాటం ఆడుతుందని తెలిపారు.తక్షణమే అంబుజా సిమెంట్ పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లాలో చేనేత,రైతుల, కార్మిక,కర్షకుల సమస్యలపై యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్షులు దేశపాక శ్రీనివాస్ నేతృత్వంలో జిల్లా కమిటీ ప్రొఫెసర్ కోదండరాంకు అనేక విషయాలపై కులంకుశంగా చర్చించి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు.పై విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని,పార్టీ పక్షాన ప్రజల కోసం ఎల్లవేళలా కృషి చేయాలని దేశపాక శ్రీనివాస్ కు కోదండరాం సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ నకిరెకంటి అశోక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని శ్రీనివాస్ రెడ్డి సహాయ కార్యదర్శులు మందార బాలకృష్ణ రెడ్డి,జమ్మి గిరిబాబు చౌటుప్పల్ మండల నాయకులు సంగిశెట్టి జనార్ధన్ రామన్నపేట మండల అధ్యక్షులు గడ్డం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.